త్రివిక్రమ్ కు దైర్యం చెప్పిన తారక్?

Saturday, January 13th, 2018, 08:53:28 PM IST

టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ అజ్ఞాతవాసి సినిమాతో ఒక్కసారిగా డౌన్ అయ్యాడు. కెరీర్ లో ఎన్నడు లేని విధంగా దారుణమైన డిజాస్టర్ ని చూసే సరికి అభిమానులు సినీ ప్రముఖులు షాక్ అవుతున్నారు. అంత మంచి డైరెక్టర్ కి అపజయం అందడం ఏమిటని చర్చించుకుంటున్నారు. పైగా పవన్ రాజకీయాల్లో బిజీ అవుతున్నసమయంలో దారుణమైన డిజాస్టర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ అభిమానులు చాల వరకు తెలియని బాధతో సతమతమవుతున్నారు. అయితే ఎక్కువగా దర్శకుడు త్రివిక్రమ్ బాధపడుతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. అయితే త్రివిక్రమ్ కు ఎన్టీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. జయాపజయాలు చాలా కామన్ అని రిజల్ట్ గురించి మర్చిపొమ్మని చెప్పారట. అంతే కాకుండా మనం తీయబోయే సినిమా గురించి ఆలోచించాలని అప్పుడు హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లోకి రావచ్చని దైర్యం చెప్పారని సమాచారం.