మరోసారి తండ్రి అయిన ఎన్టీఆర్!

Thursday, June 14th, 2018, 03:11:54 PM IST

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు నేడు నిజంగా పెద్ద సంబరమనే చెప్పుకోవాలి. నేడు ఆయన మరోమారు తండ్రి అయ్యారు. ఇప్పటికే వారికి ఒక కుమారుడు అభయ రామ్ ఉండగా, నేడు ఆయన భార్య లక్ష్మి ప్రణతి మరొక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ స్వయంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. నా కుటుంబం మరింత పెద్దదయింది, ఈ సారి కూడా మెగా బిడ్డే అంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆయన ఇలా పోస్ట్ చేసారో లేదో ఆయనకు అభిమానులనుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా ఆయనకు ట్విట్టర్ వేదికగా అభినందలు తెలిపారు. కాగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా అరవింద సమేత చిత్రంలో ఆయన నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది…..