జక్కన్న కోసం అమెరికా చెక్కేసిన ఎన్టీఆర్ -చరణ్ ?

Wednesday, March 7th, 2018, 12:58:44 PM IST

బాహుబలి తరువాత ఓ క్రేజీ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. సినిమా పరిశ్రమలో మెగా హీరోలు .. నందమూరి హీరోలమధ్య ఎప్పుడు గట్టి పోటీ ఉంటున్న విషయం తెలిసిందే. ఈ మద్యే అందరు హీరోలు, అటు హీరోల అభిమానులు కూడా కలివిడిగానే ఉంటున్నారు. మరి ఈ ఇద్దరు హీరోలు కల్సి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో కదా !! అచ్చంగా అలాంటి ఆసక్తిని రేకెత్తించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్న రాజమౌళి . ఎన్టీఆర్ – చరణ్ లతో ఓ సినిమా చేస్తానని చెప్పాడు. ఈ సినిమా కోసం ఈ ఇద్దరు హీరోలు అమెరికాలో మేక్ ఓవర్ కోసం అమెరికా వెళ్ళారట . ఎన్టీఆర్ – చరణ్ కలిసి .. బ్యాగులతో శంషాబాద్ విమానాశ్రయంలో కనిపించడంతో వీరిద్దరూ అమెరికా వెళ్లేందుకు రెడీ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. వీరితో అమెరికాలో ఓ వర్క్ షాప్ ని నిర్వహించాలనే వారిని అక్కడికి పిలిపిస్తున్నాడట రాజమౌళి. అందుకే వారిద్దరూ అమెరికా పయనమయ్యారని టాక్. మరి ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి సినిమాలో ఎలా కనిపిస్తారో చూడాలి. అన్నట్టు ఈ చిత్రం సెప్టెంబర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.