రెండో షెడ్యూల్ కి సిద్దమవుతున్న ఎన్టీఆర్ ?

Wednesday, April 25th, 2018, 02:20:05 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పీడ్ పెంచేసాడు. అయన హీరోగా నటిస్తున్న సినిమా ఇప్పటికే మొదటి షెడ్యూల్ ని పూర్తీ కావొచ్చింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్స్ లో మొదటి షెడ్యూల్ రేపటితో పూర్తీ కానుంది . ఫిలిం సిటీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక రెండో షెడ్యూల్ ని కూడా ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు. ఈ నేపథ్యంలో మే 3 నుండి రెండో షెడ్యూల్ ప్రారంబిస్తారట. ఈ షెడ్యూల్ కూడా ఫిలిం సిటీలోనే జరగనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్ లో కీలక నటీనటులు పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారట. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments