అసామాన్యుడిగా మారతానంటున్న ఎన్టీఆర్ ?

Tuesday, May 8th, 2018, 09:17:43 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ తో పాటు ఫిట్ నెస్ విషయంలో కూడా కేర్ తీసుకుంటున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా పలు ఆసక్తికర టైటిల్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి అసామాన్యుడు అనే టైటిల్ పెడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ టైటిల్ విషయంలో కథ ప్రకారమే ఈ టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైటిల్ పై అటు ఎన్టీఆర్ కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. మరి ఈ టైటిల్ పై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Comments