షాక్ ..త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ల టైటిల్ ఫిక్స్ ?

Monday, October 16th, 2017, 11:52:04 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమా జనవరిలో ప్రారంభం కానుంది .. ఈ లోగా అయన దిల్ రాజు బ్యానర్ లో ఓ యువ దర్శకుడితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సూపర్ కథను సిద్ధం చేసాడని .. అలాగే టైటిల్ కూడా ఫిక్స్ చేసాడని వార్తలు వస్తున్నాయి . ఈ చిత్రంలో ఎన్టీఆర్ మిలటరీ పాత్రలో కనిపిస్తాడన్న వార్తలు మాత్రం తగ్గడం లేదు .. ఇందులో నిజ నిజాలు ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాకు సోల్జర్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నారట ! తాజాగా ఈ టైటిల్ పై మీడియా లో తెగ ప్రచారం జరుగుతుంది. అది నిజమా కదా అన్న విషయాలు పక్కన పెడితే త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమా మొదలై ఆరునెలలు గడుస్తున్నా కూడా ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు అలాంటిది ఎన్టీఆర్ సినిమాకు అప్పుడే టైటిల్ ఫిక్స్ చేశాడా అన్నది ప్రశ్నార్థకంగా మారింది .. చూద్దాం ఏమి జరుగుతుందో.