ఎన్టీఆర్ ను డిటెక్టీవ్ చేస్తున్న దర్శకుడు ..?

Sunday, November 5th, 2017, 12:55:17 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందే సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలతో మొదలైన విషయం తెలిసిందే. ఎప్పటినుండో త్రివిక్రమ్ తో సినిమా చేయాలనీ ఎన్టీఆర్ కోరిక. అందుకే ఆయనకోసం ఇన్నాళ్లు ఎదురు చూసాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఓ సూపర్ కథను రెడీ చేసాడని అనుకుంటారు ఎవరైనా కానీ .. దానికి రివర్స్ గా ఓ నవల హక్కుల తీసుకున్నాడట త్రివిక్రమ్ ! అదేంటి త్రివిక్రమ్ కలంలో మంచి బలం ఉందిగా ఎందుకు వేరే కథ అంటే దానికి రీజన్ ఏమిటన్నది పక్కన పెడితే 1980 నాటి కథ, అది కూడా డిటెక్టీవ్ కథ అని తెలిసింది ? ఇదివరకే త్రివిక్రమ్ తీసిన అఆ సినిమాకూడా యద్దనపూడి సులోచన రాణి రాసిన మీనా నవల ఆధారంగా సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోకి మాటలను స్వయంగా త్రివిక్రమ్ రాసాడు. అలాగే ఈ డిటెక్టీవ్ నవలకుడా తీసుకుని తన మార్క్ డైలాగ్ ను రాస్తాడట. ఆ నవల హక్కులు కొనేసాడు త్రివిక్రమ్. సో మొత్తానికి ఎన్టీఆర్ డిటెక్టీవ్ గా తన మార్క్ హీరోయిజాన్ని చుపిస్తాడన్నమాట !! మరి ఈ విషయంలో నిజ నిజాలు ఎంత వరకన్నది తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments