చంద్ర బాబు నాయుడు ఫస్ట్ లుక్ ..!

Wednesday, September 12th, 2018, 03:19:34 PM IST

అద్భుత కథలతో ఆద్యంతం చక్కటి భావోద్వేగాలతో విలువలతో కూడిన సినిమాలు తియ్యడంలో క్రిష్ జాగర్లమూడి ఎంత దిట్టో ఆయన ఇది వరకు తీసిన చిత్రాలు చూస్తేనే అర్ధం అవుతుంది. ఐతే ఇప్పుడు ఆ దర్శకుడు ఒక మహా యాగాన్నే చేస్తున్నాడు అని చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన తీస్తున్న చిత్రం సాధారణమైన చిత్రం కాదు.”ఆ దేవుని యొక్క ప్రతి రూపం అంటే ఎలా ఉంటుందో తెలీని వారికి దేవుడు అంటే టక్కున గుర్తొచ్చే ప్రతీరూపానికి ప్రాణం, ప్రతి తెలుగువాడు అన్నా అని పిలుచుకుని గుండెల్లో పెట్టుకుని ఆరాధించే వైనం”, ఆయన నటనతో “విశ్వ విఖ్యాత నటసార్వభౌమ’ అని అనిపించున్న నటుడు ఆయనే స్వర్గీయ శ్రీ “నందమూరి రామారావు” గారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగానే తీస్తున్న చిత్రం “యన్టీఆర్”.

ఐతే ఈ చిత్రం లో మన భల్లాలదేవుడు దగ్గుబాటి రానా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు ఆ పాత్ర తాలూకా ఫస్ట్ లుక్ ని వారి చిత్ర బృందం విడుదల చేశారు. రానా అచ్చం చంద్రబాబు నాయుడు గారిలానే ఉన్నారు. ఒక్క సారి చూసి మళ్ళీ చూస్తే యుక్త వయస్సులో ఆ చంద్రబాబు గారినే చూస్తున్నామా అనే సందేహం రాక మానదు. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు తమ అన్న గారి పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ఎలా నటించబోతున్నారు అని ఎదురు చూస్తున్నారు. నారా రానా గారిని అదే.. నారా చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ లుక్ ని మీరు కూడా ఓ లుకేయ్యండి..

  •  
  •  
  •  
  •  

Comments