బాహుబలి రేంజ్ లో ఎన్టీఆర్ బయోపిక్ సంగీతం ?

Saturday, October 21st, 2017, 11:16:42 AM IST

బాహుబలి సినిమా సాధించిన విజయంలో సంగీతం , రీ రికార్డింగ్ కూడా కీలక భూమిక పోషించాయి. ఆ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు. తాజాగా అయన మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది. మహానటుడు ఎన్టీఆర్ జీవితం అందరికి ఆదర్శం కాబట్టి ఆ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న కీరవాణి .. ఈ చిత్రాన్ని బాహుబలి రేంజ్ లో సంగీతం ఉంటుందని తెలిపారు. మరో వైపు ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే సన్నాహాలు సంచలన దర్శకుడు వర్మ చేస్తున్నాడు. మరి ఈ రెండింటిలో ఏది ముందు రెడీ అవుతుందో చూడాలి