జయలలిత పాత్రలో కాజల్?

Tuesday, April 10th, 2018, 03:46:24 PM IST

టాలీవుడ్ చరిత్రలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నందమూరి తారక రామారావు గారి బయోపిక్ కోసం ప్రస్తుతం పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. దర్శకుడు తేజ నిర్మాత బాలయ్య నటీనటులు ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ జీవితంలో ఎంతో మంది తారలు ఆయనకు సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ ఎంతగా ఫెమస్ అయ్యారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే కొన్ని పాత్రలను పిక్స్ చేసిన బాలయ్య గత కొంత కాలంగా జయలలీత పాత్ర కోసం కొంత మంది సీనియర్ హీరోయిన్స్ తో సంప్రదింపులు జరుపుతున్నారట.

ఎన్టీఆర్ తో జయలలిత చాలా సినిమాల్లో నటించారు.ఆ తరువాత కోలీవుడ్ కి వెళ్లి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఇకపోతే ఆమె క్యారెక్టర్ చాలా కీలకం కావడంతో ఎన్టీఆర్ బయోపిక్ కోసం కాజల్ జయలలిత పాత్రలో కనిపించనుందని సమాచారం. కాజల్ అగర్వాల్ తో తేజ రెండు సినిమాలు చేశారు. ఇప్పుడు మరో సినిమాలో కూడా నటించనుందని అది ఎన్టీఆర్ బయోపిక్ అని రూమర్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కాజలే వివరణ ఇవ్వాలి.

  •  
  •  
  •  
  •  

Comments