చంద్రబాబు పాత్రలో ఆయనే కనిపిస్తారా?

Tuesday, April 3rd, 2018, 10:47:42 AM IST

టాలీవుడ్ లో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో గాని, సినిమా పై వస్తోన్న రూమర్స్ మాత్రం మాములుగా లేవు. రీసెంట్ గా సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపిస్తున్నాడు. కానీ మిగతా పాత్రలకు ఎవరిని సెట్ చేశారనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్ జీవితం ఎన్నో మలుపులు తిరిగిందని అందరికి తెలిసిందే. ఆయన జీవితంలో అతి ముఖ్యమైన పాత్రల కోసం ఎవరిని ఎంచుకుంటారు అనేది ఆసక్తికరమైన విషయం.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం ఎవరిని సెట్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఇటీవల రాజశేఖర్ ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ కి రావడంతో సినిమాలో ఆయన కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అయితే చంద్రబాబు క్యారెక్టర్ ఆయనకే అని కొన్ని రూమర్స్ వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ ఇంకా ఆ విషయాన్ని ఫైనల్ చేయలేదు. మరి చంద్రబాబు పాత్రలో ఎవరు కనిపిస్తారో చూడాలి.