అత్యంత కీలక ఘట్టంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్..!

Monday, October 1st, 2018, 10:29:16 AM IST

అన్న నందమూరి తారక రామారావు బయోపిక్ గా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం ఇప్పటి వరకు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే. తాజాగా తదుపరి షెడ్యూల్ కోసం శ్రీకాకుళంలో ప్లాన్ చేశారట. ఈ నెల 4నుండి అక్కడ కొత్త షెడ్యూల్ మొదలు పెడతారట. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ శ్రీకాకుళంలోనే జరపడానికి ప్రత్యేక కారణం ఉందంటుంది యూనిట్ .. అదేమిటంటే ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత కీలకమైన ఘట్టం .. చైతన్య రధ యాత్ర. ఈ ఎపిసోడ్ ని ప్రత్యేకంగా అక్కడే తీయాలని ఫిక్స్ అయ్యారు .. ఈ రధ యాత్ర శ్రీకాకుళం మొదలుకొని .. వైజాగ్, విజయనగరం, అన్నవరం, గుంటూరు జిల్లాలో ఈ యాత్రకు సంబందించిన సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా నాలుగో షెడ్యూల్ ఇది. ఈ షెడ్యూల్ తో దాదాపు సినిమా పూర్తయినట్టే. మిగిలిన షూటింగ్ ని మళ్ళీ హైదరాబాద్ లో మొదలు పెట్టనున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.