టైటిల్ లోగో : ఎన్టీఆర్..సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు !

Wednesday, January 17th, 2018, 11:16:35 PM IST

తెలుగు ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సందడి మొదలైపోయింది. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ని తాజగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ నే ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న దృశ్యాన్ని డిజైన్ చేశారు. కాగా ఇది కేవలం టైటిల్ కోసం విడుదుల చేసిన పోస్టర్ మాత్రమే. ఫస్ట్ లుక్ లో బాలయ్య లుక్ ని రివీల్ చేయనున్నారు.

ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ చెప్పిన స్లోగన్ ‘సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్ళు’ అని రాశారు. సాంజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన ఓ మహానుభావుడికి ఇదే మా నివాళి అంటూ పోస్టర్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలుగు రాజకీయాలతో ముడి పడి ఉండడంతో అటు సినీ వర్గాలు ఇటు రాజకీయ వర్గాలు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.