ఫ్యాన్స్ కు ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్ ఫిక్సయింది!

Thursday, May 17th, 2018, 05:51:54 PM IST

ఇటీవల విడుదలయిన జై లవకుశ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుని హ్యాట్రిక్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రస్తుతం ఆయన హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం శరవేగంగా జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఒక లైలాకోసం, ముకుంద, డీజే చిత్రాల నటి పూజ హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈనెల 20వ తేదీ ఎన్టీఆర్ ఫాన్స్ కు అతి ముఖ్యమైన రోజు. ఎందుకంటె ఆ రోజు ఆయన పుట్టినరోజు కావడం. ఇప్పటికే చాలా రోజులనుండి ఆయన అభిమానులు త్రివిక్రమ్ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు.

అయితే మొత్తానికి వారి కలలకు తెరపడే రోజు రానే వచ్చిందని చెప్పాలి. నేడు ఆ చిత్రాన్ని నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తమ చిత్రం ఫస్ట్ లుక్ అలానే టైటిల్ అనౌన్స్మెంట్ ఉంటుందని సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. దీనితో ఒక్కసారిగా ఎన్టీఆర్ ఫాన్స్ ఆనందోత్సహాల్లో తేలియాడుతున్నారు. ఎన్నాళ్ళనుండో ఎదురుచూస్తున్న తమకు మంచి తీపి కబురు చెప్పిన హారిక సంస్థ వారికి కృతజ్ఞతలు చెపుతూ కామెంట్స్ చేస్తున్నారు……..