ఆ పాత్రను జన్మలో చేయలేనంటున్న ఎన్టీఆర్ ?

Wednesday, May 2nd, 2018, 12:25:12 PM IST

తాతగారి పాత్రను చేయడం ఈ జన్మలో జరగని పని అని చెప్పేసాడు ఎన్టీఆర్. ఆ పాత్రలో నటించడం కుదరదని .. అందులో జీవించాలని అన్నారు. ఒక వ్యక్తిగా అలా నటించడం చాలా కష్టమైన పని అని అది ఈ జన్మలో తన వల్ల కాదని చెప్పేసాడు. నిన్న జరిగిన మహానటి సినిమా పాటల వేడుకలలో పాల్గొన్న అయన ఈ మాటలు అన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ఓ రోజు నిర్మాత స్వప్న వచ్చి ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో ఎన్టీఆర్ పాత్ర ఉంది అది చేయాలనీ అడిగిందని .. అయితే తాను ఆ పాత్రను చేయలేనని చెప్పానని అన్నాడు. ఈ విషయం పై ఇప్పటికే చాలా సార్లు చెప్పానని అయన పేర్కొన్నాడు. ఈ సినిమాలో నటించిన కీర్తి, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లకు హ్యాట్సాఫ్ చెబుతూ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని అన్నారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 9 న విడుదల కానుంది.