గోదారి బోటు మృతుల కుటుంబాలకు ఎన్టీఆర్ చేయూత

Friday, September 20th, 2019, 05:20:25 PM IST

గోదారి పరవళ్లు మీద పాపికొండల అందాలు చూడాలని వెళ్లిన దాదాపు 77 మంది గోదారి జలాల్లో గల్లంతు అయ్యారు. వాళ్లలో 26 మందిని రక్షించారు. మిగిలిన వాళ్లలో 35 మంది మృత దేహాలను బయటకు తీశారు. ఇంకా 16 మంది ఆచూకీ లభించాల్సి ఉంటుంది. అందులో ఎవరు కూడా బ్రతికే అవకాశమే లేదు. కనీసం వాళ్ళ మృత దేహాలైన దొరుకుతాయోమో అని వెతుకుతున్నారు.

దీనిపై యావత్తు దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా ఎన్టీఆర్ ఈ ఘటనలో మృతి చెందిన వాళ్ళకి ఒక్కొక్కరికి చొప్పున రూ. 5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ తరుపున ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఎవరికీ పెద్దగా తెలియకుండా చేస్తున్నాడు. ఈ విషయం కూడా గోదావరి జిల్లాల ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి అనధికారికంగా బయటకు వచ్చింది.

చిన్న సహాయం చేసిన కానీ పెద్దగా చెప్పుకొని పబ్లిసిటీ ఇచ్చుకునే ఈ రోజుల్లో, కుడి చేత్తో చేసిన సహాయాన్ని ఎడమ చేతికి కూడా తెలియనివ్వకుండా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈ ఒక్క సందర్బాల్లోనే కాదు అనేక ఆపద సమయాల్లో కూడా ఎన్టీఆర్ సహాయం చేసాడని తెలుస్తుంది. కానీ ఎన్నడూ కూడా వాటి గురించి బయటకు చెప్పుకున్న సందర్భాలు లేవు. మనం చేసిన సాయం పదిమందికి ఉపయోగపడితే చాలు కానీ, పదిమందికి తెలియాలని లేదు అని చెప్పే తారక్ కి హ్యాట్సఫ్.