“అరవింద సమేత”లో ఎన్టీఆర్ కు మొదటి అరగంట మాటల్లేవ్.!

Tuesday, October 9th, 2018, 07:08:42 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే మనకి వెంటనే గుర్తొచ్చేవి ఆయన అద్భుత నటన,డాన్సులు మరీ ముఖ్యంగా ఆయన గుక్క తిప్పుకోకుండా చెప్పే భారీ డైలాగులు.కానీ ఇప్పుడు త్రివిక్రమ్ తో ఈ దసరాకు థియేటర్లలో ముందుగానే దసరా తీసుకురాబోతున్న “అరవింద సమేత వీర రాఘవ” చిత్రంలో ఎన్టీఆర్ కు మొదటి అరగంట మాటలే ఉండవు అంటున్నారు ఆ చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఎన్టీఆర్ అంటేనే డైలాగులకు పెట్టింది పేరు.దానికి తోడు త్రివిక్రమ్ కూడా తన మాటలతో మాయ చేసేస్తారు.అలాంటిది అద్భుతమైన డైలాగులను మనం ఎదురు చూడొచ్చు.కానీ కథానుసారం మొదటి అరగంటలో ఎన్టీఆర్ కు అక్కడక్కడా చిన్న చిన్న డైలాగులు ఉంటాయి కానీ ఆయన శైలిలో భారీ డైలాగులు వంటివి ఉండవని త్రివిక్రమ్ తేల్చి చెప్పేసారు.అయినా సరే కేవలం రెండు మూడు మాటల్లోనే వంద మాటల్లో ఉన్న భావాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళగలిగే దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రంలో వీర రాఘవునితో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తాడో చూడాలంటే ఈ నెల 11 వరకు ఆగాల్సిందే.