బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇవ్వనున్న ఎన్టీఆర్?

Wednesday, May 16th, 2018, 07:02:22 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి త్వరలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోయే చిత్రానికి ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమవుతోంది. నిజానికి ఈ చిత్రం ఎలా తెరకెక్కబోతోంది, కథ, కథనాలు ఎలావుంటాయి అనేది ఎవరికీ తెలియదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని రాజమౌళి చిత్రానికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. #RRR పేరుతో డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ విడుదల చేసిన ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రం పై అంచనాలు ఊపందుకున్నాయి.

ఇటీవల మహేష్ బాబు తో భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మించనున్నారు. ఎప్పుడూ రాజమౌళి చిత్రాలకు పనిచేసే కీరవాణి, కే కే సెంథిల్ కుమార్ సహా ఇతర సాంకేతిక నిపుణులందరూ ఈ చిత్రానికి కూడా పనిచేయనున్నట్లు సమాచారం. కాగా మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తోందట ఆ చిత్ర బృందం. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే తారక్ బర్త్ డే కి ఆయన అభిమానులకు రెండు కానుకలతో డబుల్ ట్రీట్ ఇచ్చినట్లే మరి…….

Comments