ఎన్టీఆర్ సినిమా పై కొత్త ట్విస్ట్ … ఫాన్స్ కు పండగే ?

Wednesday, November 30th, 2016, 11:43:41 AM IST

ntr
ఇంకా ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో అనే ప్రశ్న అయన ఫాన్స్ లో నెలకొనే ఉంది. ”జనతా గ్యారేజ్” విడుదలై చాలా రోజులే అవుతున్నా కూడా ఎన్టీఆర్ ఇంకా తన నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పటికే పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు, అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం … ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది! లేటెస్ట్ గా ఓ రచయిత చెప్పిన కథ బాగా నచ్చిందని, అయితే ఇందులోనే ఓ పెద్ద ట్విస్ట్ ఉందట .. ? అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపిస్తాడట !! కథ నచ్చడంతో దర్శకుడు ఎవరనే విషయం పై సెర్చ్ చేస్తున్నారని తెలిసింది. ఆ మధ్య ‘అదుర్స్’ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నైటించి ఆకట్టుకున్న ఎన్టీఆర్ మరోసారి రెండు పాత్రలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ అంటే నిజంగా అయన ఫాన్స్ కు పండగే కదా !! ఈ సినిమాకు సంబందించిన వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.