పవర్ స్టార్ కి వెల్కమ్ చెబుతున్న యంగ్ టైగర్ ఫాన్స్

Tuesday, January 9th, 2018, 11:53:41 AM IST

సాధారణం గా మెగా నందమూరి అభిమానుల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా లోను, బయట చూస్తూనే ఉంటాం. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదదల కానున్న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం విజయవంతం కావాలని అభినందనలు తెలుపుతూ యంగ్ టైగర్ యన్ టి ఆర్ ఫాన్స్ గుంటూరు జిల్లా మాచర్ల రామ టాకీస్ థియేటర్ ఆవరణలో పెట్టిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. పవన్ మరియు యన్ టి ఆర్ ఫోటోల తో అజ్ఞాతవాసికి అల్ ది బెస్ట్ ఫ్రమ్ టౌన్ వైడ్ యన్ టి ఆర్ ఫాన్స్ అంటూ వారు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇద్దరు ప్రముఖ కథానాయకుల అభిమానులు ఈ విధంగా ఆదర్శవంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వం లో యన్ టి ఆర్ నూతన చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ విచ్చేయడం మన అందరికి విదితమే.