ఈ నెల రోజులపాటు చిక్కడు దొరకడట ఎన్టీఆర్ ?

Wednesday, October 3rd, 2018, 10:43:03 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ ఈ నెల 11న విడుదలకు సిద్ధం అయింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి . ముక్యంగా ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ ఫాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ వందకోట్ల క్లబ్ లోకి చేరతాడని వాళ్ళ ఆశ. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది .. వచ్చే నెలనుండి రాజమౌళి మల్టి స్టారర్ లో నటిస్తాడు ఎన్టీఆర్ .. కాబట్టి .. ఈ నెల రోజులు ఫ్యామిలీ తో కలిసి హాలిడే కి వెళ్లనున్నాడట. ఏకధాటిగా షూటింగ్ లో పాల్గొనడం .. మరోవైపు మానసికంగా కుంగుబాటుతో ఉన్న ఆయనకు ఇప్పుడు మానసిక ప్రశాంతత అవసరం కాబట్టి ఈ నెల రోజులు ఎవ్వరికి చెప్పకుండా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడట. ఎక్కడికి అన్నది సస్పెన్స్ గా మారింది. దాదాపు నెల తరువత ఇండియాకి వచ్చి ఫ్రెష్ గా రాజమౌళి షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.