తమిళ దర్శకుడికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ?

Thursday, May 17th, 2018, 02:13:31 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఓ తమిళ దర్శకుడికి ఓకే చెప్పాడట? గత కొన్ని రోజులుగా సదరు దర్శకుడు ఎన్టీఆర్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు, ఈ నేపథ్యంలో ఆ దర్శకుడు చెప్పిన సబ్జెక్టు విని ఎన్టీఆర్ ఓకే చెప్పాడట. ఇంతకీ ఎవరా దర్శకుడు అని షాక్ అవుతున్నారా .. అయన ఎవరో కాదు అట్లీ కుమార్. రాజా రాణి సినిమాతో దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న అట్లీ కుమార్ ఆ తరువాత విజయ్ తో తేరి ( తెలుగులో పోలీసోడు ) మెర్సల్ సినిమాలను తెరకెక్కించారు. ఆయనకు ఎప్పటినుండో తెలుగులో సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడట. అతనికి టాలీవుడ్ అంటే చాల ఆసక్తి ఉందట . .అందుకే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని అట్లీతో చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ తరువాత అయన రాజమౌళి – చరణ్ లతో కలిసి మల్టి స్టారర్ సినిమా చేయనున్నాడు కాబట్టి ఈ లోగా అట్లీ సినిమా పూర్తీ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. సో త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

Comments