అరవింద కోసం ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ ?

Tuesday, October 2nd, 2018, 10:53:52 AM IST

అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేతలో అయన డ్యూయెల్ రోల్ పోషిస్తున్నాడట. అదికూడా తండ్రి కొడుకులుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ వార్త సిని వర్గాల్లో హల్చల్ అవుతుంది. ఈ సినిమాలో పెనీవిటి అనే పాట బాగా పాపులర్ అయింది .. ఈ పాట .. తండ్రి పాత్ర నేపథ్యంలో వస్తుందని .. ఆ ఎన్టీఆర్ కు జోడిగా ఈషా రెబ్బా నటించిందట. రాయలసీమ ఫ్యాక్షన్ ని కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడట త్రివిక్రం. సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనుంది. ఇప్పటికే అటు ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్ నిజంగా డ్యూయల్ రోల్ చేస్తున్నాడా లేదా అన్నది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.