ఈ సోదరులకు ఆహ్వానం .. అందలేదా ?

Monday, December 26th, 2016, 09:01:36 PM IST

ntr-kalyan-ram
భారీ ప్రతిష్టాత్మకంగా తన వందో సినిమాను మొదలు పెట్టాడు నందమూరి బాలకృష్ణ. తెలుగు నేలను నలు దిశలా పాలించి ఖ్యాతి సంపాదించిన శాతకర్ణి జీవిత కథతో ”గౌతమి పుత్ర శాతకర్ణి” చిత్రంలో నటిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ఈ రోజు తిరుపతిలో గ్రాండ్ గా పాటల వేడుకను ఏర్పాటు చేసారు. అత్యంత భారీ స్థాయిలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకులకు పలువురికి ఇన్విటేషన్స్ అందాయి .. నందమూరి ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్టు వార్తలు ఓ వైపు వస్తుంటే .. మరో వైపు ఈ ఈవెంట్ కు సంబందించిన ఎలాంటి ఆహ్వాన పత్రిక ఈ సోదరులకు అందలేదని తెలుస్తోంది ? ఆ సోదరులు ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉందనుకుంటా .. అవును వారిద్దరే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు? మొదటినుండి ఎన్టీఆర్ ను బాలయ్య దూరం పెడుతూనే ఉన్నాడు ? ఈ వేడుకలో ఏకంగా వందమంది చీఫ్ గెస్ట్ లు పాల్గొంటారట !! మరి ఆ వందమందిలో ఈ సోదరులు ఇద్దరు లేకపోవడంతో అందరు షాక్ అవుతున్నారు? మరి ఈ విషయం పై బాలయ్య ఎలా ఫీలయ్యాడో కానీ .. నందమూరి ఫాన్స్ మాత్రం బాగా ఫీల్ అవుతున్నారు ?

  •  
  •  
  •  
  •  

Comments