ఎన్టీఆర్ త్రిపాత్రిభిన‌యం.. ఫిబ్ర‌వ‌రి 11 ముహూర్తం ఫిక్స్‌..

Thursday, January 19th, 2017, 02:20:59 AM IST

ntr
ఎన్టీఆర్ త్రిపాత్రాభినం క‌న్ఫ‌మ్ అయ్యింది. ఈసారి కెప్టెన్సీ ప‌గ్గాలు బాబికే ద‌క్కాయి. ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకంపై నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 11 ముహూర్తం నిర్ణ‌యించార‌ని తెలుస్తోంది. దీంతో నిన్న‌టివ‌ర‌కూ ఉన్న స‌స్పెన్స్‌కి తెర‌వీడింది.

ఎట్ట‌కేల‌కు బాబితోనే ఈ ప్రాజెక్టును సెట్స్‌కి తీసుకెళుతున్నార‌ని క‌న్ఫ‌మ్ అయ్యింది. అయితే అస‌లు విష‌యాన్ని చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉందింకా. భారీ క్రేజుతో సెట్స్‌కెళ్ల‌నున్న ఈ చిత్రానికి `జై లవకుశ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముందే రిలీజ్ తేదీని ఫైన‌ల్ చేశారు. ఆగష్టులో సినిమా రిలీజ‌వుతుంద‌ని తెలుస్తోంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల‌ ఎంపిక సాగుతోంది. టెంపర్‌, నాన్నకుప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ స‌హా కామ‌న్ జ‌నాల్లో భారీ అంచ‌నాలున్నాయి.