ఎన్టీఆర్ కోసం .. ఆ ఐటెం పాపను దించుతున్నారుగా ?

Friday, January 27th, 2017, 11:17:08 PM IST

ntr
”జనతా గ్యారేజ్” వచ్చి చాలా రోజులే అవుతుంది .. ఇప్పటికి ఎన్టీఆర్ నటించే సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు. బాబీ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు ఎన్టీఆర్. ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ గట్రా పూర్తయిన ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి రానుంది. నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక హీరోయిన్ విషయం పక్కన పెడితే .. ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి గ్లామర్ భామ లక్ష్మి రాయ్ ని దింపుతున్నారు ? ఇటీవలే చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 లో హాట్ ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న లక్ష్మి రాయ్, ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ తరహా సాంగ్ చేస్తుందట .. పక్క కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో లక్ష్మి రాయ్ ని దింపడానికి ప్రత్యేక కారణం .. దర్శకుడు బాబీ .. ? బాబీ, పవన్ తో చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో లక్ష్మి రాయ్ హాట్ ఐటెం సాంగ్ చేసి అదరగొట్టిన విషయం తెలిసిందే . మళ్ళీ ఆ మ్యాజిక్ రీపీట్ చేయడనికే ఈ అమ్మడిని దించుతున్నారట ? అన్నట్టు ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు చేస్తున్నట్టు తెలిసింది. సో త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడి కానున్నాయి?