పొల్లాచ్చి నుంచి యూర‌ప్ ఛ‌లో?

Sunday, June 10th, 2018, 12:13:22 PM IST

యంగ్ య‌మ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈనెల 18 నుంచి పొల్లాచిలో కొత్త షెడ్యూల్ తెర‌కెక్క‌నుంది. అక్క‌డ బ‌డా షెడ్యూల్ త‌ర‌వాత‌.. యూర‌ప్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో రెండు వారాల పాటు సుదీర్ఘంగా చిత్రీక‌ర‌ణ సాగిస్తార‌ట‌. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 12న సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇటీవ‌లే తార‌క్ ఫ‌స్ట్‌లుక్ ని రిలీజ్ చేశారు. దీనికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రం కోసం తార‌క్ ఏకంగా 20 కేజీల బ‌రువు త‌గ్గాడు. కొత్త లుక్ కోసం విదేశీ నిపుణుడి స‌మ‌క్షంలో జిమ్మింగ్ చేశాడు తార‌క్‌. తొలిసారి ఎన్టీఆర్ స‌ర‌స‌న ముంబై బ్యూటీ పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. త‌మ‌న్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments