మహేష్ కి ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరిన ఎన్టీఆర్ ?

Friday, June 1st, 2018, 02:23:57 AM IST

ఈ మధ్య కేంద్ర మంత్రి రాజ్య వర్ధన్ సింగ్ ”మనం ఫిట్నెస్ గా ఉంటె దేశం కూడా ఫిట్నెస్ గా ఉంటుందంటూ” ఓ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆ ఛాలెంజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. తాజగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ని ఎన్టీఆర్ కు విసిరాడు .. అది స్వీకరించిన ఎన్టీఆర్ .. తాజాగా ఆ ఛాలంజ్ ని మహేష్ కి విసిరాడు .. మహేష్ తో పాటు నందమూరి కళ్యాణ్ రామ్, చరణ్, కొరటాల శివ, రాజమౌళి లకు హమ్ ఫిట్ హాయ్ తో ఇండియా ఫిట్ అంటూ ఛాలెంజ్ విసిరాడు. రామ్ చరణ్ అకౌంట్ దొరకక పోవడంతో ఆ ఛాలెంజ్ గురించి చరణ్ కు చెప్పండి అంటూ ఉపాసనకు పోస్ట్ చేసాడు ఎన్టీఆర్. మరి ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ పై మహేష్ ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. ఈ ఇక చరణ్ , కళ్యాణ్ రామ్ అయితే ఇప్పటికే ఫిట్నెస్ విషయంలో సిక్స్ ప్యాక్ తో రెడీ గా ఉన్నారు. మరి మహేష్ సంగతి ఏమిటో చూడాలి.