రాజమౌళి సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుసా ?

Tuesday, April 3rd, 2018, 10:30:37 PM IST


బాహుబలి తరువాత క్రేజీ దర్శకుడు రాజమౌళి నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడో అన్న విషయంపై ఎన్నో డౌట్స్ ఉండేవి .. అయితే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా గురించి చెప్పగానే అందరిలో షాక్ ఏర్పడింది. ఒకేసారి రామ్ చరణ్ , ఎన్టీఆర్ లతో మల్టి స్టారర్ చేయడం ఏమిటా ? అన్న ఆలోచనలు కలిగాయి. తాజాగా ఈ సినిమాకోసం చరణ్, ఎన్టీఆర్ లు అమెరికాలో ఫోటో షూట్ కూడా చేసొచ్చారు. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఎన్టీఆర్ స్పందించాడు .. ఈ రోజు ఐపీఎల్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ .. రాజమౌళి ఇంకా ఈ సినిమా కథను తనకు పూర్తిగా చెప్పలేదని, సినిమాకు సిద్ధం కావాలని వ్యాఖ్యానించాడు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ గురించి తనకు ఎలాంటి పిలుపు రాలేదని చెప్పారు. క్రికెటర్స్ జీవిత కథలతో సినిమాలు రావడం మంచిదే అని .. కానీ తాను మాత్రం అలాంటి బయోపిక్ లో నటించనని చెప్పేసాడు. సో .. మొత్తానికి రాజమౌళి సినిమా గురించి కొంత క్లారిటీ అయితే ఇచ్చాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాకు ఏకంగా 250 కోట్ల బడ్జెట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  •  
  •  
  •  
  •  

Comments