జక్కన్న మల్టి స్టారర్ లో ఎన్టీఆర్ పాత్ర రివీల్ ?

Tuesday, July 31st, 2018, 12:14:08 AM IST

బాహుబలి లాంటి వండర్ ను ఆవిష్కరించిన అమరశిల్పి జక్కన్న .. అదే రాజమౌళి తదుపరి సినిమా ఏమిటంటే సందేహాలను పటాపంచలు చేస్తూ ఎన్టీఆర్ – చరణ్ లతో మల్టి స్టారర్ ప్లాన్ చేసాడు రాజమౌళి. ఆ సినిమా అనౌన్న్ వచ్చినప్పటినుండి ఈ సినిమా పై రకరకాల పుకార్లు మాత్రం పుట్టుకొస్తున్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిస్తారంటూ ప్రచారం జరుగుతున్నా విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కథ విషయంలో మరో రూమర్ పుట్టుకొచ్చింది .. అదేమిటంటే ఈ సినిమా 1947 కి పూర్వం జరిగే కథతో ఉంటుందని ప్రచారం జరుగుంది. ఈ విషయం పై అటు రాజమౌళి కూడా సైలంట్ గా ఉండడంతో అందరు ఇదే నేపథ్యం అని ఫిక్స్ అయ్యారు. ఇక తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పై కొత్త రూమర్ పుట్టుకొచ్చింది. అదేమిటంటే .. ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వతంత్ర సమరయోధుడిగా కనిపిస్తాడని .. అయన పాత్ర .. అల్లూరి సీతారామరాజు షేడ్ లో ఉంటుందంటూ జోరుగా పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి అద్భుతమైన కథ ఇచ్చాడంటూ ప్రచారం అయితే జోరుగా ఉంది. మరి ఇందులో నిజంగానే ఎన్టీఆర్ సమరయోదుడిగా కనిపిస్తాడా లేదా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. అన్నట్టు ఈ చిత్రాన్ని నవంబర్ లో సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments