పవన్ హీరోయినే కావాలంటున్న .. ఎన్టీఆర్ ?

Monday, September 25th, 2017, 01:10:25 PM IST


మొత్తానికి జై లవకుశ సినిమాతో సంచలనం రేపాడు ఎన్టీఆర్. ఏకంగా మూడు పాత్రల్లో అయన నటన వైరల్ అయింది. మరో వైపు బాక్స్ ఆఫీస్ లో కూడా దున్నేస్తూ ఇప్పటికే 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ , త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నవంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అప్పుడే హీరోయిన్ ఓకే అయినట్టు తెలుస్తోంది ? ఇందులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25వ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అను ఇమ్మానుయేల్ నటిస్తుందట. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సరసన నటిస్తున్న ఈమె .. మళ్ళీ త్రివిక్రమ్ .. ఎన్టీఆర్ తో చేసే సినిమాలో కూడా హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం. త్రివిక్రమ్ అను పేరు సూచిస్తే .. ఎన్టీఆర్ ఓకే చెప్పాడట ? ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని అందులో ఒక హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ ఎంపిక అయిందట ? ఇప్పటికే టాలీవుడ్ లో అను ఇమ్మానుయేల్ కు వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ లాంటి హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయట ? మొత్తానికి అను జోరు ఓ రేంజ్ లో ఉంది మరి.

Comments