ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమా ?

Wednesday, May 2nd, 2018, 11:44:18 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న చిత్రం ఇటీవలే మొదటి షెడ్యూల్ ను ఫిలిం సిటీ లో పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. రేపటి నుండి రెండో షెడ్యూల్ కూడా అక్కడే జరగనుంది. రెండో షెడ్యూల్లో కూడా మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలిసింది. ఐటీ ఈ సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని టాక్. జగపతి బాబు, నాగేంద్ర బాబు ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారని .. నాగేంద్ర బాబు పాత్ర కేవలం మొదటి పదినిమిషాలు ఉంటుందని సమాచారం. రెండు కుటుంబాల పోరు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయాలనీ ప్లాన్ చేసారు.

  •  
  •  
  •  
  •  

Comments