ఎన్టీఆర్ తో కలిసి త్రివిక్రమ్ మొదలెట్టేసాడు ?

Friday, April 13th, 2018, 10:02:16 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు హైద్రాబాద్ లో మొదలైంది. వీరిద్దరి సినిమా అనగానే అటు ప్రేక్షకులతో పాటు ఇటు సినీ జనాల్లో కూడా ఆసక్తి నెలకొంది. గత ఏడాది అక్టోబర్ లో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయినా ఈ సినిమా నేటినుండి ఈ నెల 25 వరకు ఫిలిం సిటీ లో షూటింగ్ జరపనున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొదలెట్టేసాడు. త్రివిక్రమ్ సినిమాకు ఎన్టీఆర్ యాక్షన్ తో మొదలెట్టాడన్నమాట. ఎన్టీఆర్ సరసన పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ మే రెండో వారంనుండి జరపనున్నారట. ఇక ఈ సినిమాకోసం ఎన్టీఆర్ తన లుక్ ని కొత్తగా మార్చే పనిలో పడ్డాడు. పూర్తీ స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments