యాక్షన్ తో రంగంలోకి దిగుతున్న ఎన్టీఆర్ ?

Wednesday, April 11th, 2018, 11:53:12 AM IST

జై లవకుశ హిట్ తరువాత ఎన్టీఆర్ హీరోగా నటించే సినిమా రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధం అయింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సీనిమా ఈ నెల 12 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమాలో మొదటి షెడ్యూల్ ని యాక్షన్ సన్నివేశాలతో మొదలు పెడతారట. 13 నుండి హైద్రాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ ఈ నెల 25 వరకు జరుగుతున్నట్టు తెలిసింది. రామ్ – లక్ష్మణ్ నేతృత్వంలో ఈ యాక్షన్ ఎపిసోడ్ ని రూపొందిస్తారట. హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే ఎంపికైంది.