త్రివిక్రమ్ కోసం ట్రేండింగ్ అవుతున్న ఎన్టీఆర్ లుక్ ?

Monday, April 2nd, 2018, 11:21:24 AM IST

ఈ మధ్య ఆర్ ఆర్ ఆర్ అంటూ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కే మల్టీ స్టారర్ ట్రెండీగా మారింది. ఇప్పుడు అదే రేంజ్ లో టి టి టి అనే కొత్త ట్రెండ్ కూడా వైరల్ అవుతుంది. ఇంతకీ టి టి టి అంటే ఏమిటి అని షాక్ అవుతున్నారు .. టి టి టి అంటే త్రివిక్రమ్ – తారక్ – థమన్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా. ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా ఇప్పటికే పూజ కార్యక్రమాలు ప్రారంభించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుండి ప్రారంభం కానుంది.

ఈ సినిమాకు మొదట సంగీతం అందించేది అనిరుధ్ అని పేరు వినిపించింది. కానీ పవన్ అజ్ఞాతవాసి దెబ్బకి అనిరుద్ అవుట్ అయ్యాడు. ఆ ప్లేస్ లో దేవి శ్రీ ప్రసాద్ పేరు వినిపించింది కానీ ఫైనల్ గా థమన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ సినిమాకోసం ఎన్టీఆర్ కూడా న్యూ లుక్ ట్రై చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా ఈ ముగ్గురు కలిసి ఓ సెల్ఫీ కి పోజివ్వడం .. అందులో ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉండడంతో ఈ ఫోటో వైరల్ అయింది. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇలాగె కనిపిస్తాడా అంటూ ఆరాలు మొదలయ్యాయి.

  •  
  •  
  •  
  •  

Comments