రాజకీయాల్లోకి ఎన్టీఆర్ రాక ఖాయమయ్యేలా ఉందిగా…?

Thursday, October 10th, 2019, 03:00:08 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల తరువాత ఎన్నో చరిత్రలు సృష్టించినటువంటి తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనం ముందు కుదేలయిందని చెప్పాలి. దాదాపుగా ప్రజలందరికి మరియు టీడీపీ నేతలందరికీ కూడా టీడీపీ పై నమ్మకం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పాలి. కాగా ఆతరువాత ఏపీలో టీడీపీ కి పూర్వ వైభవం తేడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఎలాగైనా పార్టీ కి మునుపటి తేజస్సు తేవాలని పట్టుబట్టి కూర్చున్నారు చంద్రబాబు. కాకపోతే టీడీపీ కి పూర్వ వైభవం రావాలంటే మాత్రం ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు అందించాలని సీనియర్ నేతలు, సన్నిహితులు అందరు కూడా సూచించారు.

కానీ చంద్రబాబు అనుకున్నట్లుగా పార్టీ పగ్గాలని ఎన్టీఆర్ కి అప్పగించడానికి కొందరు ఒప్పుకోవడం లేదు. అది నందమూరి మరియు నారా కుటుంబాలు… అయితే పార్టీ దృష్టిలో అందరు సమానమేనని చెప్పుకున్నప్పటికీ కూడా ఎన్టీఆర్ కి పగ్గాలు అప్పగించడానికి ఒప్పుకోవడం లేదు. కానీ గత 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ చూపించిన తెగువ, గొప్పతనం అనేవి ప్రజలందరికి తెలుసు. అందుకనే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ కె మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది. కాగా ఒకవేళ పార్టీ పగ్గాలు ఎన్టీఆర్ కి అప్పగించినప్పటికీ కూడా పార్టీ కి పూర్వ వైభవం వస్తుందా…? అంత పెద్ద పార్టీ ని అసలు ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఎన్టీఆర్ నెట్టుకురాగలడా, అని మరికొందరు అంటున్నారు. ఇకపోతే ఎలాగైనా ఎన్టీఆర్ వల్లే టీడీపీ బతుకుంటుందని మరికొందరు అంటున్నారు. అంటే ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు త్వరలోనే అందుతాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఏమవుతుందో చూడాలి మరి.