తార‌క్‌కి అఖిల్ ఎదురెళ‌తాడా?

Monday, June 11th, 2018, 02:09:12 PM IST

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న `అర‌వింద స‌మేత‌` ద‌స‌రా బ‌రిలో రిలీజ్ కానున్న సంగ‌తి తెలిసిందే. మాట‌ల మాయావి త్రివిక్ర‌మ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాతో పోటీప‌డుతూ అక్కినేని అఖిల్ న‌టించే 3వ సినిమాని ద‌స‌రా బ‌రిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

అఖిల్ హీరోగా తొలి ప్రేమ ఫేం వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా బ్రిట‌న్‌లో రెండు నెల‌ల సుదీర్ఘ‌మైన షెడ్యూల్‌తో 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేస్తారుట‌. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా బ్యాలెన్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి .. క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్లో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ అంత‌కంటే ముందే అక్టోబర్‌నాటికే రిలీజ్ చేయాల‌న్న ఆలోచ‌న మేక‌ర్స్‌లో ఉందిట‌. ద‌స‌రా బ‌రిలో అయితే సెల‌వులు క‌లిసొస్తాయ‌ని భావిస్తున్నార‌ట‌. ఆ క్ర‌మంలోనే అర‌వింద స‌మేత‌కు అఖిల్ ఎదురెళ‌తాడా? అంటూ ముచ్చ‌ట సాగుతోంది. ఆగ‌ష్టు నాటికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి సైమ‌ల్టేనియ‌స్‌గా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్తి చేయాల‌ని వెంకీకి సూచించార‌ట‌. మ‌రి కొత్త ద‌ర్శ‌కుడికి ఇది సాధ్య‌మేనా? అన్న‌ది వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments