భ‌ద్రాద్రి రాముని చెంత తార‌క‌రాముడు!

Friday, November 10th, 2017, 06:39:50 PM IST

తార‌క‌రాముడు భ‌ద్రాద్రి రాముని సంద‌ర్శించాడు. నేడు (శుక్రవారం) తెలుగువారి అభిమాన క‌థానాయ‌కుడు తార‌క రామారావు కుటుంబ స‌మేతంగా భద్రాచలంలోని సీతారాములను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు దేవస్థానం సిబ్బంది సెల‌బ్రిటీ లాంఛ‌నాల‌తో సాద‌రంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. ఇంటిల్లిపాదికీ స్వామి వారి ప్రసాదాలను అందచేసింది ఆల‌య సిబ్బంది. ఇక ఈ పూజా కార్య‌క్ర‌మాల్లో ఎన్టీఆర్ స‌హా ద‌ర్శ‌కుడు కొరటాల శివ పాల్గొన్నారు.

నిన్న‌టితో `జైల‌వ‌కుశ‌` 50రోజులు పూర్తి చేసుకున్న వేళ .. ఇలా యాధృచ్ఛికంగానే భ‌ద్రాద్రి రాముని సంద‌ర్శించుకున్నాడో ఏమో కానీ, ఇది దైవేచ్చ అని భావించ‌వ‌చ్చు. రామాయ‌ణంలోని రావ‌ణ‌, ల‌వ‌, కుశ పాత్ర‌ల్ని అల‌వోక‌గా పోషించిన తార‌క రామునికి భ‌ద్రాద్రి రాముని ఆహ్వానం అందింద‌నే భావించాలి. ఇక కొర‌టాల శివ‌కు త‌న సినిమాలు హిట్టు కాగానే భ‌ద్రాద్రి రాముని ద‌ర్శించుకునే అల‌వాటుంది. ఇదివ‌ర‌కూ శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ త‌ర్వాత ఆయ‌న శ్రీ‌రాముని ద‌ర్శించుకున్న సంగ‌తి విదిత‌మే.

Comments