తాను వాయిస్ ఓవర్ ఇస్తే సినిమా పోతుందంటున్న స్టార్ హీరో

Monday, January 30th, 2017, 02:46:44 PM IST

ntr
ఒకప్పుడు ఈగోలతో ఉన్న మన హీరోలు ఇప్పుడు ఒకరి సినిమా గురించి మరొకరు పబ్లిసిటీ చేయడం తెలుగు సినీ పరిశ్రమలో మనం చూస్తున్నాం. అంతేకాదు ఒక స్టార్ హీరో సినిమాకి మరొక స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మనకు తెలిసిన విషయమే… జల్సా సినిమాకు మహేష్ బాబు తో వాయిస్ ఓవర్ చెప్పించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరొక స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా రామ రామ.. కృష్ణ కృష్ణ.. లాంటి కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తాజాగా రానా నటించిన ‘ఘాజీ’ అనే సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు ఎన్టీఆర్ నిరాకరించాడని తెలుస్తుంది.

గతంలో తాను వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు పెద్దగా విజయవంతం కాలేదని, అందుకే ఇకపై ఎవరికీ వాయిస్ ఓవర్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు ఎన్టీఆర్ ఆ చిత్ర బృందానికి చెప్పినట్టు తెలుస్తుంది. అందుకే వారు ఎన్టీఆర్ కు బదులుగా చిరంజీవితో వాయిస్ ఓవర్ చెప్పించినట్టు తెలుస్తుంది. దీంతో ఇక ముందు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్పే అవకాశాలు లేనట్టు తెలుస్తుంది.