పాతాళభైరవి హీరో ఎన్టీఆర్ కాదు?

Monday, April 9th, 2018, 06:27:59 PM IST

ఒకప్పటి తెలుగు చిత్రరాజాల్లో ఒకటి అయిన పాతాళ భైరవి చిత్రం తెలుగు వారు ఎప్పటికి మరిచిపోలేని ఒక అద్భుతం అని చెప్పాలి. అందులో ఎన్టీఆర్, ఎస్వీఆర్ ద్వయం పోటాపోటీ నటన అజరామరం అనే చెప్పుకోవాలి. రాజకుమారిని ప్రేమించిన తోటరాముడు ఎలాగైనా సంపన్నుడు కావాలని భావిస్తాడు. అందుకోసం నేపాలీ మాంత్రికుడిని ఆశ్రయిస్తాడు. అయితే తోటరాముడినే బలి ఇవ్వాలని భావించిన మాంత్రికుడి కుయుక్తికి, తన యుక్తితో మాంత్రికుడిని బలి ఇచ్చి పాతాళ భైరవి అనుగ్రహాన్ని పొందుతాడు తోటరాముడు. ఇక అసలు విషయం ఏమిటంటే మొదట తోటరాముడి పాత్రకు ఏఎన్నార్ ను అనుకున్నారట కెవి రెడ్డి గారు. ఓ రోజు వాహిని స్టూడిలో టెన్నిస్ ఆడుతున్న ఎన్టీఆర్ ఏఎన్నార్ ని చూస్తూ వున్నారట క్విరెడ్డి గారు.

వరుసగా ఒక మూడు బంతులు రాకెట్ కి తగలేకపోవడంతో చిర్రెత్తుకొచ్చిన ఎన్టీఆర్ తరువాతి బంతిని ఎంతో బలంగా కొట్టారట. ఆ దెబ్బకు బంతి కనిపించకుండాపోయిందట. అలా ఎన్టీఆర్ రాకెట్ పట్టుకుని బంతిని కొట్టిన విధానం తనకు నచ్చడంతో మరో ఆలోచనలేకుండా ఎన్టీఆర్ ని పాతాళభైరవిలో తోటరాముడి పాత్రకు ఎన్నుకున్నారట కెవి రెడ్డి. అప్పట్లో సినిమాల్లో హీరోలకు డూప్ లు ఉండేవారు కాదు. కనుక ఈ సినిమాలో పోరాట సన్నివేశాల్లో పాల్గొనేముందు రోజూ ఎన్టీఆర్ ఎస్వీఆర్ ఉదయాన్నే 4.30ని.లకు వచ్చి వాహిని స్టూడియో లో సాధన చేసేవారట.

సాధన అనంతరం ఇద్దరికీ రెండు ఇడ్లి, ఒక వడ పెట్టేవారట. అయితే ఆ అల్పాహారం తమకు సరిపోవడంలేదని ఎన్టీఆర్ అంటే దానిని రెట్టింపు చేశారట కెవి రెడ్డి. కాగా ఈ సినిమా కోసం అప్పట్లో ఎన్టీఆర్ తీసుకున్న పారితోషికం రూ. 250. విజయా సంస్థ కోసం రెండేళ్లలో నాలుగు సినిమాలు చేయాలని ముందే ఒప్పందం జరిగిపోయింది. 1951 మార్చి 15న 13 ప్రింట్లతో ‘పాతాళ భైరవి’ విడుదలైంది. మంచి టాక్‌ రావడంతో ఆ తర్వాత 60 ప్రింట్‌లకు పెరిగింది. 10 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని జరుపుకొంది. అప్పట్లో ఇదీ ఓ రికార్డే. అలా ఏఎన్నార్ కు దక్కవలసిన తోటరాముడి పాత్ర ఎన్టీఆర్ ను వరించింది……

  •  
  •  
  •  
  •  

Comments