బాహుబలి, ఘాజి మూవీ టీంలకు తారక్ అభినందనలు!

Friday, April 13th, 2018, 11:33:09 PM IST


ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొన్ని సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు ఒకపెద్ద హీరో ఆడియో ఫంక్షన్ వంటివి జరిగితే ఆ హీరో ఫామిలీ సభ్యలు మాత్రం వచ్చేవారు. అయితే రాను రాను మన ఇండస్ట్రీ హీరో లు కూడా ఇగో లు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఉండటానికి నిర్ణయించుకున్నారు. మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చిన విషయం తెలిసిందే. అటువంటివి భవిష్యత్తులో మరిన్ని వస్తే బాగుంటుందని ఆయా హీరోల అభిమానులతో పాటు సగటు ప్రెకషకులు కూడా కోరుకుంటూఅన్నారు. అయినా ఇదికూడా ఒక శుభ పరిణామమని, ఇటువంటి ఆరోగ్యపాటి వల్ల భవిష్యత్తులో మరిన్ని కాంబినేషన్లతో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగలవని సైన్ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అలానే ఒక సినిమా హిట్ అయితే ప్రస్తుతం సినీప్రముఖులు చాలా మంది ఆ చిత్రబృందానికి అభినందనలు తెలియచేయడం పరిపాటి అయిపొయింది. ఇక విషయంలోకి వెళితే, నేడు ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలకు అవార్డులు దక్కడంతో టాలీవుడ్‌‌ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘బాహుబలి – 2’, ‘ఘాజీ’ సినిమా టీమ్‌లకు అభినందనలు తెలిపారు. తెలుగు సినిమా గర్వపడేలా చేశారంటూ తారక్ ట్వీట్ చేశారు. 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి – 2’ ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా నిలవగా.. సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ‘ఘాజీ’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది.. …

  •  
  •  
  •  
  •  

Comments