విన‌య‌న్న‌కు తార‌క్ అభినంద‌న టూ లేట్‌… ఎందుక‌లా?

Sunday, January 22nd, 2017, 12:06:59 PM IST

vv-vinayak-ntr
వివి వినాయ‌క్‌- తార‌క్ మ‌ధ్య అనుబంధం గురించి తెలిసిందే. ఆది, సాంబ‌, అదుర్స్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను త‌న కెరీర్‌కి అందించాడు. విన‌య‌న్నా..! అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుచుకుంటాడు తార‌క్‌.. అయితే అలాంటి తార‌క్ విన‌య‌న్న‌ను మ‌ర్చిపోయాడు. విన‌యన్న చేసిన `ఖైదీనంబ‌ర్ 150`బంప‌ర్ హిట్ కొట్టి, 150 కోట్ల వ‌సూళ్ల దిశ‌గా దూసుకుపోతుంటే.. అదేమీ ప‌ట్ట‌న‌ట్టుగా తార‌క్ మాత్రం సైలెంటుగానే ఉండిపోయాడు. నిన్న‌గాక మొన్న‌టి వ‌ర‌కూ వినాయ‌క్‌కి ఫోన్ చేసి క‌నీస‌మాత్రంగానైనా అభినందించ‌లేదు.

బాబాయ్ సినిమా శాత‌క‌ర్ణి చూశాక మాత్రం వాహ్‌వా.. అంటూ స్పందించిన తార‌క్ త‌న‌కి అత్యంత ఆప్తుడైన వినాయ‌క్‌ని తొలిరోజే ఫోన్ చేసి ఎందుకు అభినందించ‌లేదూ? అంటూ మెగాభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. ఏదేమైనా .. ఈ విష‌యంలో తార‌క్ ఆల‌స్యంగా ఫోన్ చేసి వినాయ‌క్‌ని అభినందించారంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే తార‌క్ ఫోన్ చేసి అభినందించాడులే..! అంటూ వినాయక్ మాత్రం క‌న్విన్స్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ద‌ట్సిట్‌.