పూరి ఆవిష్క‌రించిన‌ ‘ఓ పిల్లా నీ వ‌ల్లా’ మోష‌న్ పోస్ట‌ర్‌

Monday, January 30th, 2017, 10:31:54 AM IST

o-pilla-ni-valla
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులుగా బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. ఈ సినిమా ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నుల్లో ఉంది. స్పీడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్‌ని లాంచ్ చేశారు. పోస్ట‌ర్ క్యూరియ‌స్‌గా ఉంద‌ని పూరి ప్ర‌శంసించారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ – “ఓ పిల్లా నీ వ‌ల్లా షూటింగ్ పూర్త‌యింది. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుగుతున్నాయి. ల‌వ్, కామెడి, యాక్ష‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న చిత్ర‌మిది. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్ స‌హా న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. మ‌ధు పొన్నాస్ సంగీతం, షోయ‌బ్ అహ్మ‌ద్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద అస్సెట్ అవుతాయి. ఫిబ్ర‌వ‌రి ఆడియో విడుద‌ల చేసి, మార్చిలో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పూరి చేతుల‌మీదుగా మోష‌న్‌పోస్ట‌ర్‌ లాంచ్ చేయ‌డం, ఆయ‌న ప్ర‌శంసించ‌డం.. సంతోషాన్నిచ్చింది. పూరి స‌ర్‌కి ధ‌న్య‌వాదాలు“ అన్నారు.

కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్, సుద‌ర్శ‌న్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ చిన్ని మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ‌, సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.⁠⁠⁠⁠