ఇమిగ్రేషన్ పై స్పష్టతనిచ్చిన ఒబామా

Friday, November 21st, 2014, 06:30:49 PM IST

obama
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వలస వాదుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించా నున్నారు. ఇక ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీయుల సేవలను ఉపయోగించుకోవాలని ఇలా చేయడం వలన దేశానికి మరింత ప్రయోజనం కలుగుతుందని ఒబామా తెలిపారు. ఒబామా దేశప్రజలనుద్దేశించి మాట్లాడారు. వలసవాద చట్టాలలో మార్పులు చేయనున్నట్టు ఒబామా తెలియజేశారు. ఈ వలసవాద చట్టాలలో చేయనున్న మార్పులు వలన భారత్ చైనా దేశాల నుంచి వచ్చిన దాదాపు 50 లక్షల మందికి ఊరట లభించనున్నట్టు తెలుస్తున్నది.

అయితే ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లు విజయం సాధించడంతో… ఒబామా సవరించాలనుకున్న వలసవాద చట్టాల మార్పుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. అయితే…వలసవాద చట్టాల మార్పు విషయంలో ఒబామా వెనకడుగు వెనకడుగు వేసేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదు. వలసవాద చట్టాలను మారుస్తామని ఒబామా స్పష్టం చేశారు.

ఇక ఇది ఇలా ఉంటే అధ్యక్ష భవనం ముందు శుక్రవారం ఓ మహిళా తుపాకి పట్టుకొని అనుమానాస్పదంగా సంచరిస్తుండటంతో పోలీసు అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.