హిల్లరీ ని గెలిపించి తీరేలా ఉన్న ఒబామా

Friday, November 4th, 2016, 11:11:52 AM IST

hilllary-clinton-obama
వారం రోజులలో అమెరికా ఎన్నికలు మొదలు అవ్వనున్న నేపధ్యం లో హిల్లరీ క్లింటన్ – ట్రంప్ ల మధ్యన భారీ గా నువ్వా నేనా అనే పోటీ నడుస్తోంది. హిల్లరీ క్లింటన్ కి స్వయంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా సపోర్ట్ ఇవ్వడం విశేషం. మొన్న మొన్నటి వరకూ ఆమె మీద పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు మాట్లాడిన ఒబామా ఇప్పుడు ఆమెకి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తున్నాడు. ఆమె ఎలాగైనా గెలిచే రూట్ లో వెళుతూ ఉండగా కొండంత అండగా ఒబామా ఆమెని గెలిపించే పనిలో పడ్డాడు. ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ, తన మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీకి మద్దతివ్వాలని కొలంబస్ లో జరిగిన ప్రచార సభలో ఆయన అన్నారు. ” నేనైనా బిల్ క్లింటన్ అయినా మా కన్నా హిల్లరీ కే అవకాశాలు , అర్హతలు ఎక్కువగా ఉన్నాయి . ఆమె అమెరికా ని చక్కగా ఎలగలరు ” అని ఒబామా స్వయంగా చెప్పడం విశేషం.