ఒబామా రాసిన లేఖను భద్రంగా దాచుకున్న ట్రంప్…!

Monday, January 23rd, 2017, 05:46:51 PM IST

trump
వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ గందరగోళానికి గురి చేశాయి. ఆయన అమెరికా అధ్యక్షుడిగా గెలవడం కల అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళందరి కలలను కల్లలు చేస్తూ ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఉండగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా పేరు చెప్తేనే విరుచుకుపడే వాడు.

కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత నిన్నటివరకు విమర్శించిన ఒబామాపై ట్రంప్ ప్రేమ ఒలకబోస్తున్నారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ట్రంప్ పరిపాలనా వర్గంలోని ప్రముఖులందరికీ ఒక పార్టీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్వేతసౌధంలో నాకోసం ఒబామా ఒక అందమైన లేఖను వదిలి వెళ్లారు. నేను ఇంతకుముందే ఓవల్ కార్యాలయానికి వెళ్లి దీనిని గుర్తించాను. నిజంగా ఇది ఒబామా రాసిన అందమైన లేఖ. దీనిని నాదగ్గర భద్రంగా పెట్టుకుంటాను. ఆ లేఖలో ఏం ఉందనేది మీడియాకు కూడా చెప్పను అని ఆ లేఖను తీసి ఫై భాగం వరకు చూపిస్తూ ఒబామా సంతకం వైపు తీక్షణంగా చూసి అందులో అంశాలను తన మనసులో ఉంచుకుని గౌరవిస్తానని చెప్పి ఆ లేఖను తన కోర్ట్ లోపల జేబులో పెట్టుకున్నారు.