బిగ్ న్యూస్: ఒడిశా లో 14 రోజుల పాటు లాక్ డౌన్!

Sunday, May 2nd, 2021, 03:06:14 PM IST


దేశం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 4 లక్షలకు చేరువలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,600 కి పైగా కరోనా వైరస్ భారిన పడి బాధితులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే తాజాగా ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టేందుకు 14 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.అయితే మే 5 వ తేదీ ఉదయం అయిదు గంటల నుండి 19 వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. అయితే ఒడిశా ప్రభుత్వం ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది.

కూరగాయల కోసం ఇంటి నుండి కేవలం 500 మీటర్ల దూరం పరిధిలో సంచరించాలి అని పేర్కొంది. అయితే ఆ దుకాణాలు సైతం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి అని పేర్కొనడం జరిగింది. అయితే ఇంకా ఇతర నిత్యావసరాల పై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే ఇప్పటి కే తెలుగు రాష్ట్రాలు కర్ఫ్యూ ను విధించగా ఢిల్లి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాలు పెరుగుదల నేపథ్యం లో ఇతర రాష్ట్రాలు సైతం లాక్ డౌన్ అమలు చేసేందుకు అలోచన చేస్తున్నాయి.