అధికార పార్టీ ఎమ్మెల్యేపై అభ్యంతకర పోస్టులు – చివరికి ఏం జరిగిందంటే…?

Sunday, December 15th, 2019, 05:12:20 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకవైపు మహిళలకు రక్షణగా కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంటే, మరొక వైపు ఏకంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పైనే కొందరు ఆకతాయిలు కొన్ని అభ్యంతకరమైన పోస్టులు పెట్టారు. కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని పై నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ అనే ఇద్దరు ఆకతాయిలు సామజిక మాంద్యమాల్లో కొన్ని అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన చిలకలూరి పేటకు చెందిన పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా ఇటీవల ఆంద్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరితపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయం మీద అశోక్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఇలా అభ్యంతకరమైన పోస్టులు పెట్టే వారందరు కూడా ఫేక్ అకౌంట్లు సృష్టించి, ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, వీటిని తొందర్లోనే అరికడతామని పోలీసులు చెబుతున్నారు.