ఆఫీస‌ర్ బ‌య్య‌ర్ ల‌బోదిబో

Monday, June 4th, 2018, 10:34:33 AM IST

కింగ్ నాగార్జున‌-ఆర్జీవీ `ఆఫీస‌ర్‌` ప్ర‌కంప‌నాలు ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని భారీ మొత్తాల‌కు బ‌య్య‌ర్ల‌కు అమ్మేశాడు ఆర్జీవీ. తీరా చూస్తే క‌లెక్ష‌న్స్ నిల్. ముఖ్యంగా ఆఫీస‌ర్ పంచ్ ఏపీ బ‌య్య‌రుపై ఓ రేంజులో ప‌డింద‌ని చెప్పుకుంటున్నారు. ఏపీలోని 8 జిల్లాల‌కు రిలీజ్ హ‌క్కులు కొనుక్కున్న సుబ్ర‌మ‌ణ్యం అనే బ‌య్య‌రుపై ఆఫీస‌ర్ ఎఫెక్ట్ ఓ రేంజులో ప‌డిందిట‌. దీంతో అత‌గాడు ల‌బోదిబో మంటూ ఫిలింఛాంబ‌ర్ వాళ్ల‌ను సంప్ర‌దించే ప‌నిలో ప‌డ్డాడుట‌.

నాగార్జున గ‌త చిత్రం `రాజుగారిగ‌ది 2` ఏపీ ఏరియాకి 7.2 కోట్లు అమ్ముడైంది. అందులో స‌గం రేటుకి.. అంటే 3.5 కోట్ల‌కు `ఆఫీస‌ర్‌` చిత్రాన్ని స‌ద‌రు బ‌య్య‌రు కొనుక్కున్నాడుట‌. అయితే ఆర్జీవీ ఫ్లాపుల రికార్డును ప‌ట్టించుకోకుండా కొనుక్కున్నందుకు అత‌గాడికి పెద్ద రేంజులోనే పంచ్ ప‌డిందిట‌. థియేట‌ర్ల‌లో ఈగ‌లు తోల‌డంతో అత‌డికి లోక‌ల్‌గా రిలీజ్ చేసిన పంపిణీదారు నుంచి ఫోన్ల‌పై ఫోన్లు వెల్లువెత్తాయిట‌. దీంతో ఆ ట్రాజెడీ భ‌రించ‌లేక ఛాంబ‌ర్‌ని సంప్ర‌దించేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని తెలుస్తోంది. ఇక స‌ద‌రు బ‌య్య‌రుకు ఆర్జీవీతో ప‌ర్స‌న‌ల్‌గా ప‌రిచ‌యం లేదు. స‌హ‌నిర్మాత సుధీర్ చంద్ర‌తో డీల్ పూర్తి చేయ‌డంతో ఇబ్బందులు మ‌రీ ఎక్కువ‌య్యాయ‌ని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments