అయ్యయ్యో కింగ్‌.. ఆర్జీవీ కొట్టిన దెబ్బ‌!

Saturday, June 2nd, 2018, 12:21:00 PM IST

కొన్ని త‌ప్పులు కింగ్ నాగార్జున‌కు కెరీర్ ప‌రంగా ఎలా మైన‌స్ అవుతున్నాయో సులువుగా విశ్లేషించ‌గ‌లం. ఇదివ‌ర‌కూ భాయ్ విష‌యంలో చేసిన త‌ప్పు .. ఇప్పుడు ఆర్జీవీ `ఆఫీస‌ర్‌`తో రిపీట్ చేశార‌ని టాక్ ట్రేడ్‌లో వినిపిస్తోంది. ఈ రెండు సంద‌ర్భాల్లో త‌ప్పు ఇంచుమించు ఒక‌టే. అయితే నాగార్జున అప్ప‌టి స‌న్నివేశం వేరు.. ఇప్ప‌టి స‌న్నివేశం వేరు. మ‌నం, ఊపిరి, రాజుగారి గ‌ది 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర‌వాత అత‌డి నుంచి అంత‌కుమించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ ఆశిస్తారు జ‌నం. స‌రిగ్గా అలాంటి టైమ్‌లో వెరీ బ్యాడ్‌గా ఆయ‌న రామ్‌గోపాల్ వ‌ర్మ‌ను న‌మ్మారు. ఆఫీస‌ర్ ఛాన్సిచ్చారు. అయితే అందుకు ప్ర‌తిఫ‌లం అంతే దారుణంగా ఉంది.

ఆర్జీవీ త‌న‌ని గొప్ప‌గా చూపిస్తాడ‌ని అత‌డిపై `శివ‌` నాటి ప్రేమ‌ను చూపించారే కానీ, అస‌లు ఆర్జీవీ ఇంత ప‌ని చేస్తాడ‌ని నాగార్జున ఊహించి ఉండ‌రు. నిన్న రిలీజైన ఆఫీస‌ర్ డిజాస్ట‌ర్ టాక్‌తో ఇటు తెలుగు రాష్ట్రాలు స‌హా అటు ఓవ‌ర్సీస్‌లోనూ అంతే ఢీలా ప‌డిపోయింద‌ని తెలుస్తోంది. అమెరికాలో ఏకంగా 52 లొకేష‌న్ల‌లో రిలీజ్ చేస్తే, ఈ సినిమా కేవ‌లం 27కె డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఇదివ‌ర‌కూ నాగార్జున న‌టించిన రాజుగారి గ‌ది 2- 82కె డాల‌ర్లు, ఊపిరి -76కె డాల‌ర్లు, సోగ్గాడే చిన్ని నాయ‌నా -50కె డాల‌ర్లు, మ‌నం-95కె డాల‌ర్లు వ‌సూలు చేశాయి. వాట‌న్నిటితో పోలిస్తే ఈ సినిమా ఫ‌లితం దారుణం అని తేలిపోయింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌రిస్థితి ఏమంత బాలేద‌ని చెబుతున్నారు. మొత్తానికి కింగ్ మ‌రోసారి త‌ప్పును రిపీట్ చేశార‌ని ట్రేడ్‌లో టాక్ న‌డుస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments